ఎఫ్ 2 టాక్ ఎలా ఉందంటేF2 movie talk out

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన చిత్రం ” ఎఫ్ 2 ” . తమన్నా , మెహరీన్ లు హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించాడు . ఈ చిత్రం ఈరోజు విడుదలైంది . అప్పుడే టాక్ కూడా వచ్చేసింది . ఇంతకీ ఈ సినిమా చూసిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా …… టాక్ ఎలా ఉందో తెలుసా …… సినిమా హిట్ అని అంటున్నారు .

అనిల్ రావిపూడి స్టైల్ లోనే ఈ సినిమా ఫస్టాఫ్ ఉందని , అయితే సెకండాఫ్ పై కాస్త దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేదని ఓవరాల్ గా ఎఫ్ 2 హిట్ అని అంటున్నారు . ఎంటర్ టైన్ మెంట్ వేలో సాగిన ఈ సినిమా సంక్రాంతి హిట్ గా నిలవడం ఖాయమని అంటున్నారు . వెంకటేష్ మంచి ఫన్ జనరేట్ చేసాడని , భార్య భర్తల మధ్య వచ్చే ఇగో తో వచ్చిన ఎంటర్ టైన్ మెంట్ ప్రేక్షకులను అలరించేలా ఉందని అంటున్నారు . అయితే అందరూ ఇదే అభిప్రాయంతో ఉంటారా ? మిగతా వాళ్లకు కూడా నచ్చుతుందా ? లేదా ? అన్నది కొద్దిసేపట్లోనే తెలిసిపోనుంది .

English Title: F2 movie talk out