50 రోజులు పూర్తిచేసుకున్న ఎఫ్ 2


F2 telugu film completes 50 days

ఈరోజుల్లో రెండు , మూడు వారాలు గట్టిగా ఆడటమే కష్టం అటువంటిది సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ఎఫ్ 2 చిత్రం దిగ్విజయంగా 50 రోజులను పూర్తిచేసుకుంది నేటితో . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 చిత్రాన్ని దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే . వెంకటేష్ కు జోడీగా తమన్నా నటించగా వరుణ్ తేజ్ కు జోడీగా మెహరీన్ నటించింది .

 

సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఎఫ్ 2 చిత్రానికి ప్రేక్షకులు జేజేలు పలికారు . నవ్వుల పువ్వులు పూయించిన ఈ చిత్రానికి కనకవర్షం కురిసింది . మొత్తంగా 50 రోజులను 106 కేంద్రాల్లో పూర్తిచేసుకోవడం అంటే మాములు విషయం కాదు . ఇప్పటికి కూడా మంచి వసూళ్ల ని రాబడుతోంది ఎఫ్ 2 చిత్రం . 140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించింది ఎఫ్ 2 దాంతో ఈరోజు 50 రోజుల వేడుకను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు దిల్ రాజు .

English Title : F2 telugu film completes 50 days

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Director Kodi ramakrishna died35 Lakhs Fine to Mahesh babu AMB


Kani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce