`ఎఫ్‌2` చిత్రానికి ఇండియ‌న్ ప‌నోర‌మ అవార్డ్‌!


`ఎఫ్‌2` చిత్రానికి ఇండియ‌న్ ప‌నోర‌మ అవార్డ్‌!
`ఎఫ్‌2` చిత్రానికి ఇండియ‌న్ ప‌నోర‌మ అవార్డ్‌!

గ‌త ఏడాది సంక్రాంతి బ‌రిలో నిలిచి ఊహించ‌ని విధంగా భారీ విజ‌యాన్ని సాధించిన చిత్రం `ఎఫ్‌2`. `ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌`. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఫుల్ ఆఫ్ ఫ‌న్ సీన్‌ల‌తో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్లు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించిన ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా త‌మ‌న్నా, మెహ్రీన్ క‌నిపించారు. వెంకీ ఆస‌న్ ఇప్ప‌టికీ అల్టిమేట్‌. ఈ చిత్రానికి, ఈ చిత్ర ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడికి అరుదైన పుర‌స్కారం ల‌భించింది. 2019 సంవ‌త్స‌రానికి గాను వివిధ బాష‌ల‌కు చెందిన 26 చిత్రాల‌కు కేంద్ర స‌మాచార శాఖ అవార్డుల్ని ప్ర‌క‌టించింది.

ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేప‌ట్ట‌గా ఇందులో గ‌త ఏడాది విడుద‌లైన `ఎఫ్‌2`తో పాటు ఈ చిత్ర ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇండియ‌న్ ప‌నోర‌మ అవార్డుని అందుకోనున్నారు. ఈ ఏడాది ఇండియ‌న్ ప‌నోర‌మ అవార్డుకు ఎంపికైన ఏకైక చిత్రంగా `ఎఫ్‌2` నిలిచింది.  2019 ఇండిమ‌న్ ప‌నోర‌మ అవార్డుల్లో `ఎఫ్‌2`కు రెండు అవార్డులు ద‌క్క‌డం ఆనందంగా వుంది అని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి అన్నారు.