ఎఫ్3 ప్లాట్ లైన్ ఇదే అంటున్నారుగా!

ఎఫ్3 ప్లాట్ లైన్ ఇదే అంటున్నారుగా!
ఎఫ్3 ప్లాట్ లైన్ ఇదే అంటున్నారుగా!

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఎఫ్3. 2019 బ్లాక్ బస్టర్ ఎఫ్2 చిత్రానికి ఇది సీక్వెల్. అవ్వడానికి సీక్వెల్ అయినా కూడా దర్శకుడు అనిల్ రావిపూడి చాలా తెలివిగా ఈ చిత్ర ప్లాట్ లైన్ ను ఎంచుకున్నట్లు సమాచారం. కేవలం పాత్రల డిజైన్ ను అలాగే ఉంచి పూర్తిగా కొత్త కథను వర్కౌట్ చేసాడు.

ఇండస్ట్రీలో దీనికి సంబంధించి ఎఫ్3 ప్లాట్ లైన్ ఇదేనంటూ  ఒక రూమర్ ప్రచారంలోకి వచ్చింది. దాని ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ కూడా ఒక హోటల్ బిజినెస్ ను మొదలుపెడతారట. అటు వాళ్ళ భార్యలు తమన్నా, మెహ్రీన్ ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక భర్తల పాట్లు, చివరికి ఏమైంది అన్న రీతిలో స్టోరీ వెళ్తుందని, స్టోరీ పరంగా చాలా ఫన్నీ పాయింట్స్ ను అనిల్ టచ్ చేస్తున్నాడని తెలుస్తోంది.

మరి ఎఫ్2 సక్సెస్ ను ఈసారి కూడా పునరావృతం చేయగలడా అన్నది చూడాలి.