`ఎఫ్‌3`కి డేట్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి!

`ఎఫ్‌3`కి డేట్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి!
`ఎఫ్‌3`కి డేట్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి!

టాలీవుడ్‌లో వున్న స్టార్ డైరెక్ట‌ర్‌ల‌లో యువ స్టార్‌ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి శైలి ప్ర‌త్యేకం. `ప‌టాస్` నుంచి `స‌రిలేరు నీకెవ్వ‌రు` వ‌ర‌కు త‌న న‌మ్ముకున్న కామెడీని జోడించి వ‌రుస హిట్‌ల‌ని త‌న ఖాతాలో వేసుకునున్నారు. జంథ్యాల‌, ఇవివిల త‌రువాత ఆ స్థాయిలో టాలీవుడ్ తెర‌పై న‌వ్వులు పూయిస్తున్న అనిల్ రావిపూడి పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌రో ఫ‌న్ ఫిల్మ్‌ని స్టార్ట్ చేయ‌బోతున్నారు.

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌ల తొలిక‌ల‌యిక‌లో అనిల్ రావిపూడి తెర‌కెక్కిచిన ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎఫ్‌2`. గ‌త ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఊహించ‌ని రీతిలో భారీ విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా ఏకంగా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ మూవీకి సీక్వెల్ గా `ఎఫ్‌3`ని చేయ‌బోతున్నానంటూ అనిల్ రావిపూడి ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌ని లాక్‌డౌన్ టైమ్‌లో ఫినిష్ చేసిన అనిల్  రావిపూడి త్వ‌ర‌లో ఈ సీక్వెల్‌ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు.

ఇప్పటికే అనిల్ స్క్రిప్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన దిల్ రాజు బ‌డ్జెట్‌ని కూడా ఫిక్స్ చేసేశార‌ట‌. దీంతో ఈ సీక్వెల్‌ని డిసెంబ‌ర్ 14న ప్రారంభించ‌బోతున్నామంటూ ద‌ర్శ‌కుడు అనిల్  రావిపూడి ప్ర‌క‌టించేశారు. దీంతో ఈ మూవీ ఎంత ఫ‌న్‌గా వుండ‌బోతుందో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ మ‌ళ్లీ మ‌రోసారి క‌లిసి న‌టించ‌నున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్‌లుగా న‌టిస్తారా లేక వేరే హీరోయిన్ ల‌ని తీసుకుంటారా అన్ని తెలియాల్సి వుంది.