మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌కు ఏమైంది?

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌కు ఏమైంది?
మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌కు ఏమైంది?

ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి అత‌లాకుత‌లం చేస్తోంది. దీని భారిన ప‌డిన దేశాల‌న్నీ దీక్కుతోచ‌ని స్థితికి చేరుకున్నాయి. నివార‌ణే త‌ప్ప మందు లేక‌పోవ‌డంతో క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం నిస్స‌హాయ స్థితికి చేరుకుని ఆహాకారాలు చేస్తోంది. చేష్ట‌లుడిగి ఈ విప‌త్తు నుంచి ఏ దేవుడైనా వ‌చ్చి కాపాడ‌క‌పోతాడా అని ఆకాశం వంక ప్ర‌పంచం మొత్తం దీనంగా ఎదురుచూస్తోంది.

అయితే ఇదిలా వుంటే ఆక‌తాయిలు, సైకోలు మాత్రం ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని వాడుకుంటూ ఫేక్ వార్త‌ల్ని వంటి వారుస్తూ ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో భాయాందోళ‌న‌లు పెరిగిపోతున్నాయి. కేర‌ళ‌లో ఏకంగా మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ చ‌నిపోయారంటూ సోష‌ల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఇది కేర‌ళ‌లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

మోహ‌న్‌లాల్‌కు క‌రోనా సోకింద‌ని, ఆ కార‌ణంగానే ఆయ‌న చ‌నిపోయార‌ని ఓ ఫేక్ వీడియోని సృష్టించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. దీంతో మోహ‌న్‌లాల్ ఫొటోల‌తో రూపొందించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్న కేర‌ళ పోలీసులు న‌కిలీ వార్త‌ల్ని ప్ర‌చారం చేస్తే క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కేర‌ళ ముఖ్య మంత్రి పిన‌ర‌యి విజ‌య్ కూడా న‌కిలీ వార్త‌ల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీచేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.