ఎన్టీఆర్ పై వస్తున్నవన్నీ పుకార్లేనట


fake-news-rumours-on-ntr-and-lakshmi-pranathiయంగ్ టైగర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి లకు తాజాగా ఓ కూతురు పుట్టిందని పుకార్లు షికారు చేస్తుండటంతో నందమూరి అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు . ఆ వార్త నిజమే అనుకొని ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు అందజేస్తున్నారు కూడా దాంతో షాక్ అయిన ఎన్టీఆర్ ఆ వార్తలను ఖండించాడు . లక్ష్మీ ప్రణతి ఆడపిల్ల కు జన్మనిచ్చిందని వస్తున్న వార్తలన్నీ పుకార్లు మాత్రమే అంటూ తన పి ఆర్ ఓ చేత చెప్పించాడు ఎన్టీఆర్ .

అయితే ప్రస్తుతం లక్ష్మీ ప్రణతి గర్భం దాల్చి ఉంది , కానీ ఇంకా నెలలు నిండలేదు నందమూరి అభిమానులు కోరుకుంటున్నట్లు త్వరలోనే ఆ ఇంట అమ్మాయి అడుగు పెట్టినా ఆశ్చర్యం లేదు . ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి లకు మొదటి సంతానం గా కొడుకు పుట్టాడు కాగా అతడికి అభయ్ రామ్ అని పేరు పెట్టుకున్నాడు ఎన్టీఆర్ . ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రం లో నటిస్తున్నాడు . దసరా కానుకగా అక్టోబర్ 11న ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .