స్క్రిప్ట్ పనుల్లో ఫలక్ నుమా దాస్ 2


ఫలక్ నుమా దాస్ మంచి ఓపెనింగ్స్ సాధించడంతో ఫలక్ నుమా దాస్ 2 చిత్రానికి శ్రీకారం చుట్టాడు విశ్వక్ సేన్ . మే 31 న విడుదలైన ఫలక్ నుమా దాస్ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి అలాగే వసూళ్ల కంటే వివాదాలు చుట్టుముట్టాయి దాంతో హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్ మరింత కసిగా ఫలక్ నుమా దాస్ 2 తీయనున్నట్లు ప్రకటించాడు . ప్రకటించడం వరకే కాకుండా ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాడు .

అయితే స్క్రిప్ట్ ని పూర్తిచేసినా ఈ ఏడాది మాత్రం సెట్స్ మీదకు వెళ్ళదట , వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు విశ్వక్ సేన్ . ఇక ఈ రెండో భాగంలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండనున్నట్లు ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే . హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఈసారి కేవలం తెలంగాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా విజయం సాధించేలా జాగ్రత్త పడతాడట విశ్వక్ సేన్ .