నైజాం లో బాగానే ఆడుతున్న ఫలక్ నుమా దాస్


విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఫలక్ నుమా దాస్ . కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రం మే 31న విడుదలైన విషయం తెలిసిందే . ప్రీమియర్ షోలతోనే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు జోరు తగ్గినప్పటికీ నైజాం లో మాత్రం బాగానే ఆడుతోంది . మొత్తంగా మూడు రోజుల్లో కోటిన్నరకు పైగా షేర్ కలెక్ట్ చేసింది దాంతో నైజాం దాదా అయ్యింది ఫలక్ నుమా దాస్ .

అయితే ఆంద్రప్రదేశ్ లో మాత్రం ఈ సినిమాకు అంతగా కలిసి రావడం లేదు . అక్కడ ప్లాప్ అయ్యింది . కానీ తెలంగాణ లో మాత్రం హైదరాబాదీ సినిమాగా పేరు తెచ్చుకోవడంతో మంచి వసూళ్లు వస్తున్నాయి . మొదటి రోజున 75 లక్షల షేర్ రాగా రెండో రోజున 48 లక్షల షేర్ వచ్చింది ఒక్క తెలంగాణలోనే . ఇక నిన్న ఆదివారం కావడంతో నిన్న కూడా మంచి వసూళ్లే వచ్చాయి అవి 30 నుండి 40 లక్షల షేర్ అయి ఉంటుందని అంటున్నారు దాంతో మూడు రోజుల్లోనే కోటిన్నరకు పైగా షేర్ అన్నమాట అది కూడా కేవలం నైజాం లో మాత్రమే దాంతో సక్సెస్ మీట్ పెడుతున్నారు ఈరోజు .