స‌మంత `ది ఫ్యామిలీ మెన్ 2` వ‌చ్చేస్తోంది!


స‌మంత `ది ఫ్యామిలీ మెన్ 2` వ‌చ్చేస్తోంది!
స‌మంత `ది ఫ్యామిలీ మెన్ 2` వ‌చ్చేస్తోంది!

బాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ మ‌నోజ్ బాజ్‌పాయ్ న‌టించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీమెన్‌`. రాజ్ ఎన్ డీకే ద్వ‌యం అత్యంత ప‌ర్‌ఫెక్ష‌న్‌తో రూపొందించిన ఈ వెబ్ డ్రామా అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. వెబ్ సిరీస్‌ల‌లో అత్యంత పాపుల‌ర్ సిరీస్‌గా నిలిచింది. సీమాంత‌ర తీవ్ర వాదం నేప‌థ్యంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌కి ఝౄతీయ స్థాయిలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ కూడా భారీ స్థాయిలో ల‌భించింది.

తాజాగా ఈ సిరీస్‌కి కొన‌సాగింపుగా `ది ఫ్యామిలీ మెన్ 2` రాబోతోంది. మ‌నోజ్ బాజ్ పాయ్‌, ప్రియ‌మ‌ణి కీల‌క పాలత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సిరీస్‌లో అత్యంత కీల‌కమైన పాత్ర‌లో స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని న‌టిస్తోంది. దీంతో ఈ సిరీస్‌పై దేశ వ్యాప్తంగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌ల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇండ‌ర్వ్యూల్లో త‌న పాత్ర షాకింగ్‌గా వుంటుంద‌ని, చాలా బారియ‌ర్స్‌ని ఈ సిరీస్‌తో క్రాస్ చేశాన‌ని చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.

తాజాగా ఈ వెబ్ సిరీస్‌కి సంబంధంచిన పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో టైమ్ బాంబ్ సెట్ చేస్తున్న పిక్ క‌నిపిస్తోంది. 2021 అంటూ టైమ్‌ని సెట్ చేశారు. వ‌చ్చే ఏడాది ఈ సిరీస్ సంచ‌ల‌నం సృష్టించ‌బోతోంది. తొలిసారి ఈ సిరీస్‌తో  వెబ్ ప్ర‌పంచంలోకి ఎంత‌ర‌వుతున్న స‌మంత షాకింగ్ పాత్ర‌లో స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది.