స‌మంత ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్‌!

Family men season 2 release postponed
Family men season 2 release postponed

స్టార్ హీరోయిన్ స‌మంత ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్. ఆమె న‌టించిన తొలి వెబ్ సిరీస్ అనుకున్న స‌మ‌యానికి రిలీజ్ కావ‌డం లేద‌ని తెలిసింది. రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌ద్వ‌యం రూపొందించిన సెన్సేష‌న‌ల్ థ్రిల్ల‌ర్ `ఫ్యామిలీమ్యాన్‌`. ఈ సిరీస్ ఏ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా రూపొంది సిరీస్ `ఫ్యామిలీమ్యాన్ 2`.

ఈ వెబ్ సిరీస్ ద్వారా అక్కినేని వారి ముద్దుల కోడ‌లు స‌మంత డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో టెర్ర‌రిస్టుగా సామ్ న‌టిస్తున్న‌దంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌ల చేసిన రిలీజ్ డేట్ ట్రైల‌ర్‌లోనూ ఎండింగ్‌లో సాధార‌ణ యువ‌తిక‌గా క‌నిపించి షాకిచ్చింది.

ఈ వెబ్ సిరీస్ ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంద‌ని ట్రైల‌ర్‌లో మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం రిలీజ్ డేట్ మారిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన మీర్జాపూర్ 2, తాండ‌వ్ లు వివాదంలో చిక్కుకోవ‌డం, అందులోని కొన్ని స‌న్నివేశాల్ని తొలగించ‌డం తెలిసిందే. ఈ వివాదాల నేప‌థ్యంలో `ఫ్యామిలీమ్యాన్ 2` రిలీజ్‌ని వాయిదా వేసిన‌ట్టు తెలిసింది.