స‌మంత `ది ఫ్యామిలీమెన్ 2` స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌!


స‌మంత `ది ఫ్యామిలీమెన్ 2` స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌!
స‌మంత `ది ఫ్యామిలీమెన్ 2` స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌!

విల‌క్ష‌ణ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయ్ కీల‌క పాత్ర‌లో న‌టించిన `ది ఫ్యామిలీమెన్`డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. రాజ్ అండ్‌ డీకే క్రియేట్ చేసిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌కు ప్ర‌స్తుతం పార్ట్ 2 రాబోతోంది. మ‌నోజ్ బాజ్‌పాయ్‌, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా ఈ సీజ‌న్‌లో స్టార్ హీరోయిన్‌ స‌మంత అక్కినేని పాకిస్తానీ టెర్ర‌రిస్టుగా నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్రీలుక్ వెబ్ సిరీస్‌పై అంచ‌నాల్ని పెంచేసింది. దేశ వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నసీజ‌న్ 2 స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్సియింది. ఫిబ్ర‌వ‌రి 12న ఈ సీజ‌న్ 2 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో స‌మంత క‌మ‌ర్షియ‌ల్ బారియ‌ర్స్‌ని క్రాస్ చేస్తూ షాకింగ్ పాత్ర‌లో థ్రిల్లింగ్ క‌లిగించే సన్నివేశాల్లో న‌టించిన‌ట్టు తెలుస్తోంది.

గురువారం సీజ‌న్ 2 టీజ‌ర్‌ని షేర్ చేసిన‌న స‌మంత దీనికి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌ల్ని జ‌త‌చేసింది. ఈ టైమ్ ఏ ఒక్క‌రూ సేఫ్‌గా వుండ‌లేరు. ఎవ‌రు రాజీ?.. ముఖం వెన‌క ముఖం.. రాజ్ హై ఇస్మే గెహెరా `ది ఫ్యామిలీమెన్ 2 ప్రైమ్ ఆన్ ఫిబ్ర‌వ‌రి 12` అంటూ ట్వీట్ చేసింది స‌మంత‌.