షారుఖ్ సంచలన నిర్ణయం : షాక్ లో ఫ్యాన్స్


Shah Rukh Khan
Shah Rukh Khan

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు , మరికొద్ది రోజుల పాటు సినిమాలు చేసేది లేదని స్పష్టం చేసాడు . ఇప్పటికే చాలాకాలంగా షారుఖ్ ఖాన్ కు సరైన హిట్ లేదు . వరుసగా చేస్తున్న సినిమాలన్నీ ఘోర పరాజయాలు పొందుతూనే ఉన్నాయి . ఒకవైపు ప్లాప్ లు మరోవైపు నష్టాలు కూడా దాంతో విసిగి పోయాడేమో ఇప్పట్లో సినిమాలు చేసేది లేదు అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చి పడేసాడు .

అయితే షారుక్ ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది , ఇంతకీ ఆ కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప పిల్లలకు నా భార్యకు తగినంత సమయం కేటాయించలేకపోయాను అందుకే ఇప్పుడు ఆ సమయాన్ని వాళ్లతో గడపాలని నిర్ణయించుకున్నాను అంటూ చెబుతున్నాడు షారుక్ . పిల్లల కోసం అయితే మంచిదే కానీ ఈ నిర్ణయం వల్ల షారుక్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందడం ఖాయం .