ప‌వ‌న్ సినిమా టైటిల్‌ని ఫ్యాన్స్ డిసైడ్ చేశారా?


ప‌వ‌న్ సినిమా టైటిల్‌ని ఫ్యాన్స్ డిసైడ్ చేశారా?
ప‌వ‌న్ సినిమా టైటిల్‌ని ఫ్యాన్స్ డిసైడ్ చేశారా?

ఒక‌ప్పుడు టైటిల్స్‌ని మేక‌ర్స్ డిసైడ్ చేసేవాళ్లు.. కానీ ప్ర‌స్తుతం ట్రెండు మారింది. స్టార్ హీరో సినిమా టైటిల్‌ని ఫ్యాన్సే డిసైడ్ చేస్తున్నారు. ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ల‌తో సోష‌ల్ మీడియాలో తాము నిర్ణ‌యించిన టైటిల్ పోస్ట‌ర్స్‌ని వైర‌ల్ చేస్తున్నారు. స్టార్స్‌కి కూడా ఫ్యాన్స్ నిర్ణ‌యించిన టైటిల్స్ న‌చ్చ‌డంతో వాటినై ఫైన‌ల్ చేస్తున్నారు. ఇటీవ‌ల ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రానికి `రాధేశ్యామ్‌` టైటిల్ అయితే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేయ‌డం, చివ‌రికి మేక‌ర్స్ అదే టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఇదే త‌ర‌హాలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రానికి ఫ్యాన్స్ ఓ టైటిల్‌ని సూచిస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. రెండేళ్ల విరామం త‌రువాత `పింక్‌` రీమేక్ ఆధారంగా తెర‌కెక్కుతున్న `వ‌కీల్‌సాబ్‌` చిత్రం కోసం ప‌వ‌న్‌క‌ల్యాణ్ కెమెరా ముందుకొచ్చారు. ఈ సినిమాతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఏ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రంలోనూ ప‌వ‌న్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

మొగల్ సామ్రాజ్యం నాటి కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. చారిత్ర‌క నేప‌థ్యంలో తెలుకెక్కుతున్న ఈ చిత్రంలో తెలంగాణ రాబిన్ హుడ్‌గా ప‌వ‌న్ క‌నిపించ‌నున్నారు. ఇందు కోసం ఈ చిత్రానికి గ‌జ‌దొంగ‌, బందిపోటు టైటిల్స్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఈ రెండు టైటిల్స్‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి `బందిపోటు` టైటిల్ విప‌రీతంగా న‌చ్చ‌డంతో సోష‌ల్ మీడియాలో ఈ టైటిల్‌ని వైర‌ల్ చేయ‌డం మొదుల పెట్టారు. మ‌రి దర్శ‌కుడు క్రిష్ ప‌వ‌న్ ఫ్యాన్స్ సూచించిన `బందిపోటు` టైటిల్‌ని ఫైన‌ల్ చేస్తారా? లేక `గ‌జ‌దొంగ‌`నే ఖ‌రారు చేస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ‌