ఎన్టీఆర్ పవన్ ల రికార్డ్ లను బద్దలు కొట్టిన మహేష్


Fans war on Mahesh Birthday tweetsటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ గురించి కొత్తగా చెప్పేదేముంది యువతలో , ముఖ్యంగా అమ్మయిలల్లో విపరీతమిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మహేష్ దాంతో అవలీలగా రికార్డ్ ల మోత మోగిస్తున్నాడు సోషల్ మీడియాలో . ఇప్పటికే మిగతా హీరోలకంటే ఎక్కువ మంది ఫాలోయర్స్ తో అగ్రపథాన దూసుకుపోతున్నాడు మహేష్ కాగా తాజాగా మహర్షి టీజర్ రిలీజ్ తో మరోసారి దుమ్ము రేపాడు . అసలే మహేష్ బాబు పుట్టినరోజు ఆపై మహర్షి టీజర్ రిలీజ్ కూడా కావడంతో సోషల్ మీడియాలో మహేష్ టీజర్ ని షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పండగ చేసుకున్నారు .

పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్ లాంటి స్టార్ హీరోలను సైతం పెద్ద సంఖ్యలో అభిమానులు ఫాలో అవుతున్నారు అయితే వాళ్ళకు జన్మదిన శుభాకాంక్షలు అందజేసే వాళ్ళలో రెండు మిలియన్ లకు దాటలేదు కానీ మహేష్ కు మాత్రం నాలుగున్నర మిలియన్ లు దాటిపోయారు శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్ళు . మహర్షి టీజర్ లో మహేష్ పాతికేళ్ళ కుర్రాడిలా ఉన్నాడు . దాంతో అది బాగా వైరల్ అయ్యింది . ఇక అమ్మాయిల గుండెల్లో మహేష్ మంటలు పెట్టి కొలువై ఉన్నాడు ఆ టీజర్ తో .

English Titles: fans war on mahesh birthday tweets