ఫ‌రాఖాన్ డైరెక్ష‌న్‌లో చైతూ!

Farah khan directs naga chaitanya for an comercial ad
Farah khan directs naga chaitanya for an comercial ad

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ న‌టింటిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `ఓం శాంతి ఓం`. ఈ మూవీతో ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ఫ‌రాఖాన్ పేరు బాలీవుడ్‌లో మారుమ్రోగిపోయింది. స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తున్న ఫ‌రాఖాన్ టాలీవుడ్ హీరో నాగ‌చైత‌న్య‌ని డైరెక్ట్ చేస్తోంది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య `థ్యాంక్యూ` పేరుతో విక్ర‌మ్ కె. కుమార్ రూపొంది‌స్తున్న చిత్రంలో న‌టిస్తోంది.

ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గానే నాగ‌చైత‌న్య బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఫరాఖాన్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్నారు. అదేంటీ చైతూ బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నారా? అని అంతా ఆరా తీస్తున్నారు. క‌ట్ చేస్తే చైతూ తో ఫ‌రాఖాన్ చేస్తోంది సినిమా కాదు క‌మ‌ర్షియ‌ల్ యాడ్ ఫిల్మ్‌. ఇందులో చై న‌టిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఫ‌రా ఖాన్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ట్వీట్ చేసింది. `25 ఏళ్ల క్రితం నాగార్జున న‌టించిన ఓ పాట‌కి కొరియోగ్ర‌ఫీని అందించాను. అప్ప‌టి నుంచి నాగ్‌తో స్నేహం ఏర్ప‌డింది. అది ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. ఇప్పుడు ఈ అద్భుత‌మైన కుర్రాడిని డైరెక్ట్ చేస్తున్నా` అని చైత‌న్య‌తో దిగిన ఫొటోని షేర్ చేసింది ఫ‌రాఖాన్‌.