ఆఫ‌ర్ అంటే ఆ హీరోయిన్‌ని మంచ‌మెక్క‌మ‌న్నారా?

ఆఫ‌ర్ అంటే ఆ హీరోయిన్‌ని మంచ‌మెక్క‌మ‌న్నారా?
ఆఫ‌ర్ అంటే ఆ హీరోయిన్‌ని మంచ‌మెక్క‌మ‌న్నారా?

కాస్టింగ్ కౌచ్ హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌నే కాకుండా భార‌తీయ సినీ ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేసిన విష‌యం తెలిసిందే. దీన్ని అడ్డుపెట్టుకుని శ్రీ‌రెడ్డి టాలీవుడ్‌లో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. కోలీవుడ్‌లోనూ దీనిపై పెద్ద ర‌చ్చే జ‌రిగింది. గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీ‌పాద కూడా కోలీవుడ్‌లో చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు ప్ర‌కంప‌ణ‌లు సృష్టించి పెద్ద చ‌ర్చ‌కు దారితీశాయి.

తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ న‌టి, `దంగ‌ల్‌` ఫేమ్ ఫాతిమా స‌నా షేక్ సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టింది. ఇండ‌స్ట్రీలో మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు జ‌రుగుతున్నాయ‌ని, అవ‌కాశాల పేరుతో అమ్మాయిల‌ని మోసం చేస్తున్నార‌ని తెలిపింది. అంతే కాకుండా ఇలాంటి సంఘ‌ట‌న‌లు త‌న‌కూ ఎదుర‌య్యాయని వెల్ల‌డించింది. ఇక్క‌డ ప‌డుకోకుండా అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని వాపోయింది.

ఆఫ‌ర్ అంటే త‌న‌ని శృంగారం అడిగార‌ని, మాన‌సికంగా వేధించ‌యార‌ని, వారి మాట కాద‌న్నందుకు త‌న‌కు అవ‌కాశాలు లేకుండా చేశార‌ని, కాస్టింగ్ కౌచ్ కార‌ణంగా భారీ చిత్రాల్లో న‌టించే అవ‌కాశం కోల్పోయాన‌ని ఫాతిమా ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఫాతిమా స‌నా షేక్ న‌టించిన `అజీబ్ దాస్తాన్స్‌` గ‌త నెల‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. ప్ర‌స్తుతం ఆమె చేతిలో మ‌రో సినిమా లేదు.