రామ‌రాజు భ‌యంక‌ర‌మైన లుక్ వ‌చ్చేస్తోంది!

రామ‌రాజు భ‌యంక‌ర‌మైన లుక్ వ‌చ్చేస్తోంది!
రామ‌రాజు భ‌యంక‌ర‌మైన లుక్ వ‌చ్చేస్తోంది!

దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి `బాహుబ‌లి` త‌రువాత ఆ స్థాయిలో ప్ర‌తిష్టాత్మంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.

గోండు బెబ్బులి కొమ‌రం భీం పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం అని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ 27న మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం రామ‌రాజుకు సంబంధించిన భ‌యంక‌ర‌మైన రూపాన్ని రిలీజ్ చేయ‌బోతోంది.

ఇంత వ‌ర‌కు రామ‌రాజు లుక్‌ని ప‌రిచ‌యం చేయ‌ని మేక‌ర్స్ రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ శుక్ర‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు రామ‌రాజు భ‌యంక‌ర‌మైన అవ‌తారాన్ని చూపించ‌బోతున్నామ‌ని, ఈ స‌రికొత్త అవ‌తారాన్ని చూసి అంతా థ్రిల్ అవుతార‌ని ప్ర‌క‌టించింది. ఇందులో సీత‌గా అలియాభ‌ట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరీస్ న‌టిస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల కానుంది.