విజయ్ దేవరకొండ పూరి ల చిత్రానికి టైటిల్ ఫైటర్ ?


Fighter Title for Vijay Devrakonda And Puri
Fighter Title for Vijay Devrakonda And Puri

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించడానికి సిద్దమైన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రానికి ” ఫైటర్ ” అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది . విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫైటర్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట పూరి జగన్నాధ్ . ఇక ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు .

విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ని ఎంపిక చేసే పనిలో పడ్డాడట పూరి . జాన్వీ కపూర్ కు కూడా విజయ్ దేవరకొండ నటన అంటే చాలా ఇష్టం దాంతో ఒప్పుకునే ఛాన్స్ ఉంది . టైటిల్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఫైటర్ టైటిల్ పట్ల మొగ్గు చూపిస్తున్నాడట పూరి జగన్నాధ్ . డియర్ కామ్రేడ్ తో దెబ్బతిన్న విజయ్ కి ఊర మాస్ ఇమేజ్ ఇప్పించే పనిలో పడ్డాడట .