హిట్ కోసం జుట్టు పట్టుకుంటున్న కాజల్ – అంజలి


మే 24 న 5 సినిమాలు విడుదల అవుతున్నాయి . అందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సీత చిత్రానికి మాత్రమే మొగ్గు ఉంది ఇక మిగతా సినిమాలు అంతగా చెప్పుకోతగ్గవి కాదు . సీత , ఎవడు తక్కువ కాదు , నాగకన్య , నేను లేను , లిసా 3 డి చిత్రాలు విడుదల అవుతున్నాయి . అయితే ఈ అయిదు చిత్రాల్లో అంజలి నటించిన లిసా 3 డి చిత్రానికి కూడా కాస్త ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఇది 3 డి అందునా అంజలి నటించిన హర్రర్ చిత్రం కూడా . ఇద్దరు హీరోయిన్ ల చిత్రాలు ఒకేరోజున పోటీ పడుతుండటంతో సక్సెస్ కోసం , హిట్ కోసం జుట్టు పట్టుకుంటున్నారు కాజల్ అగర్వాల్ – అంజలి .

తెలుగు , తమిళ భాషల్లో రూపొందిన హర్రర్ చిత్రం దానికి తోడు 3 డి కావడంతో లిసా కూడా ఓపెనింగ్స్ సాధించొచ్చు . అయితే మొదటి ప్రాధాన్యత మాత్రం కాజల్ నటించిన సీత చిత్రందే . తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడం , కాజల్ అగర్వాల్ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన చిత్రం కావడంతో ఈ రెండు చిత్రాలకు ఓపెనింగ్స్ అయితే వస్తాయి . ఆ తర్వాత ఆ సినిమాల్లో సత్తా ఉంటే హిట్ రేంజ్ కి వెళ్తాయి లేదంటే షరా మాములే !