వాళ్లిద్దరూ గొడవ పడ్డారా ?


Fighting between Ranbir kapoor and Alia bhatt

రణ్ బీర్ కపూర్అలియా భట్ లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే . అయితే ఈ ఇద్దరూ గొడవ పడినట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి ముంబై మీడియాలో . రణ్ బీర్ కపూర్ ఇప్పటికే పలువురు హీరోయిన్ లతో ప్రేమాయణం సాగించాడు అయితే ఏది కూడా పెళ్లి వరకు వెళ్ళలేదు అలాగే అలియా భట్ కూడా ఇంతకుముందే ప్రేమలో మునిగి తేలింది కాకపోతే అవి బ్రేకప్ అయ్యాయి .

 

దాంతో ఇద్దరు బ్రేకప్ ల జంట ఒక్క జంటగా మారింది . ఇక వీళ్ళు ప్రేమలో పడటం గొప్ప కాదు పెళ్లి వరకూ వెళితే గొప్ప అంటూ సెటైర్ వేసాడు అలియా భట్ తండ్రి మహేష్ భట్ . మహేష్ భట్ 90 వ దశకంలో అగ్ర దర్శకుడు అన్న విషయం తెలిసిందే . మహేష్ భట్ చెప్పిందే నిజం అవుతుందా అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే . ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట గొడవ పడిందట ! అయినా ప్రేమలో గొడవలు , మళ్ళీ సర్దుకు పోవడాలు కామనే కదా !

 

English Title: Fighting between Ranbir kapoor and Alia bhatt