మ‌ళ్లీ రెచ్చిపోయిన క‌త్తి మ‌హేష్.. వెంట‌నే అరెస్ట్!మ‌ళ్లీ రెచ్చిపోయిన క‌త్తి మ‌హేష్.. వెంట‌నే అరెస్ట్!
మ‌ళ్లీ రెచ్చిపోయిన క‌త్తి మ‌హేష్.. వెంట‌నే అరెస్ట్!

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్న వ్య‌క్తి కత్తి మ‌హేష్‌. గ‌తంలో సినీ విమ‌ర్శ‌కుడిగా వున్న క‌త్తి మ‌హేష్ ఓ పార్టీ ప్రోత్సాహంతో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించారు. శ్రీ‌రెడ్డి త‌ర‌హాలో ప‌వన్ై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ పాపుల‌ర్ అయ్యారు. ఆ త‌రువాత త‌న‌కు తానే రాజ‌కీయ విశ్లేష‌కుడిగా ప‌రిచ‌యం చేసుకున్న క‌త్తి మ‌హేష్ దేవుళ్ల‌ని కూడా వ‌ద‌ల‌లేదు.

ఆ మ‌ధ్య అనుచిత వ్యాఖ్య‌లు చేసి ఓ మ‌తాన్ని కించ‌ప‌ర‌చ‌డంతో క‌త్తి మ‌హేష్‌ని శాంతి భ‌ద్ర‌త‌ల నేప‌థ్‌యంలో అరెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి బ‌హిష్క‌రించింది. అప్ప‌టి నుంచి సైలెంట్‌గా వుంటూ అప్ప‌డ‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తున్న క‌త్తి మ‌హేష్ తాజాగా శ్రీ‌రామునిపై ఫేస్ బుక్‌లో అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలిసింది.

సైబ‌రాబాద్ పోలీసుల‌కు క‌త్తి మ‌హేష్ పై ఫిర్యాదు అంద‌డంతో అత‌న్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచార‌ణ నిమిత్తం నాంప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. క‌త్తి మ‌హేష్‌కు నాంప‌ల్లి కోర్టు రిమాండ్ విధించే అవకాశం వున్న‌ట్టు తెలిసింది.