అర్జున్ రెడ్డి ని వరించిన ఉత్తమ నటుడు


film fare 2018 best hero award winner vijay devarakonda

అర్జున్ రెడ్డి చిత్రంలో అద్భుత నటన ని ప్రదర్శించిన విజయ్ దేవరకొండ కు ఫిల్మ్ ఫేర్ 2018 ఉత్తమ నటుడు అవార్డు లభించింది . నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఫిల్మ్ ఫేర్ వేడుకలో విజయ్ దేవరకొండ ని ఈ అవార్డు వరించింది . అయితే ఉత్తమ నటుడి అవార్డు కేటగిరీ లో సీనియర్ హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ లతో పాటుగా ఎన్టీఆర్ , ప్రభాస్ , విజయ్ దేవరకొండ లు పోటీ పడ్డారు అయితే అందరినీ కాదని విజయ్ దేవరకొండ ని వరించింది ఉత్తమ నటుడి అవార్డు .

ఇక సీనియర్ హీరో వెంకటేష్ కు బెస్ట్ క్రిటిక్ అవార్డు ఇచ్చారు . గత ఏడాది విడుదలైన అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో నెటిజనుల తో పాటుగా జ్యురీ కూడా విజయ్ కే ఓటేసింది దాంతో 2018 ఉత్తమ నటుడు అవార్డు కొట్టేసాడు . ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన ” టాక్సీ వాలా ” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది . ఈనెలలోనే ఆ సినిమా విడుదల కానుంది . విజయ్ దేవరకొండ కు ఉత్తమ నటుడి అవార్డు రావడంతో అర్జున్ రెడ్డి యూనిట్ చాలా సంతోషంగా ఉంది .