ఫిల్మ్ ఫేర్ 2018 అవార్డుల విజేతలు వీళ్ళే


film fare 2018 telugu award winners list

నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఫిల్మ్ ఫేర్ 2018 అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది . దక్షిణ భారతదేశానికి చెందిన పలువురు నటీనటులు సందడి చేయడంతో ఆ వేడుకని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి . ఇక తెలుగులో పలు కేటగిరీలలో అవార్డులు అందజేశారు . ఈ అవార్డుల కోసం పలువురు పోటీపడ్డారు అయితే వరించినవి మాత్రం కొందరినే ! తెలుగులో ఎవరెవరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారో ఒకసారి చూద్దామా !

ఫిల్మ్ ఫేర్ 2018 అవార్డుల విజేతలు :

ఉత్తమ నటుడు – విజయ్ దేవరకొండ ( అర్జున్ రెడ్డి )
ఉత్తమ నటి – సాయి పల్లవి ( ఫిదా )
ఉత్తమ చిత్రం – బాహుబలి 2
ఉత్తమ దర్శకుడు – ఎస్ ఎస్ రాజమౌళి ( బాహుబలి 2)
ఉత్తమ నటుడు ( క్రిటిక్స్ ) – వెంకటేష్ ( గురు )
ఉత్తమ నటి ( క్రిటిక్స్ ) – రితికా సింగ్ ( గురు )
ఉత్తమ నటి ( తొలిపరిచయం ) – కల్యాణి ప్రియదర్శన్ ( హలో )
ఉత్తమ సహాయ నటి – రమ్యకృష్ణ ( బాహుబలి 2)
ఉత్తమ సహాయ నటుడు – రానా (బాహుబలి 2)
ఉత్తమ సంగీత దర్శకుడు – ఎం ఎం కీరవాణి ( బాహుబలి 2)
ఉత్తమ ఛాయాగ్రాహకుడు – సెంథిల్ కుమార్ ( బాహుబలి 2)
ఉత్తమ నృత్య దర్శకుడు – శేఖర్ మాస్టర్ ( ఖైదీ నెంబర్ 150 , ఫిదా )
ఉత్తమ గేయ రచయిత – ఎం ఎం కీరవాణి ( బాహుబలి 2 , దండాలయ్యా )
ఉత్తమ నేపథ్య గాయకుడు – హేమ చంద్ర ( ఫిదా )
ఉత్తమ గాయని – మధు ప్రియా ( ఫిదా )
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సాబు సిరిల్ ( బాహుబలి 2)
జీవిత సాఫల్య పురస్కారం – కైకాల సత్యనారాయణ