శుభ్ర‌ప‌ర్చాల్సిన టైమ్ వ‌చ్చింది – విజ‌య్ దేవ‌ర‌కొండ‌ – ఇండ‌స్ట్రీ నుంచి పెరుగుతున్న మ‌ద్ధ‌తు!


శుభ్ర‌ప‌ర్చాల్సిన టైమ్ వ‌చ్చింది - విజ‌య్ దేవ‌ర‌కొండ‌ - ఇండ‌స్ట్రీ నుంచి పెరుగుతున్న మ‌ద్ధ‌తు!
శుభ్ర‌ప‌ర్చాల్సిన టైమ్ వ‌చ్చింది – విజ‌య్ దేవ‌ర‌కొండ‌
– ఇండ‌స్ట్రీ నుంచి పెరుగుతున్న మ‌ద్ధ‌తు!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన హీరో. అత‌నికి మ‌ధ్య‌త‌ర‌గ‌తి బాధ‌లు ఏంటో తెలుసు. అందుకే క‌రోనా క్రైసిస్ టైమ్‌లో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు బాధ‌ప‌డ‌కూడ‌ద‌ని త‌న వంతు బాధ్య‌త‌ల‌గా `మిడిల్ క్లాస్ ఫండ్‌` ఫేరుతో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. 7 వేల కుటుంబాల‌కు మించి నిత్యావ‌స‌రాల‌ని అందించించారు. ఇంకా అందించాల‌నే సంక‌త్పంతో ముందుకు సాగుతున్నారు. దీన్ని త‌ట్టుకోలేని ఓ ఎల్లో మీడియా వ‌ర్గం విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై బుర‌ద‌జ‌ల్ల‌డం మొద‌లుపెట్టింది.

దీనిపై వెంట‌నే స్పందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. శుభ్ర‌ప‌ర్చాల్సిన టైమ్ వ‌చ్చింద‌ని ప‌క్షాళ‌న త‌ప్ప‌ద‌ని ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఓ వీడియోని రిలీజ్ చేస్తూ ఎల్లో మీడియాపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. దీంతో ఇండ‌స్ట్రీ నుంచి విజ‌య్‌కి మ‌ద్ద‌తు మొద‌లైంది. మీమంతా నీ వెంటే వున్నాం అంటూ చేయి చేయి క‌లుపుతున్నారు.

నోబుల్ కాజ్ కోసం ఓ వినూత్న ఆలోచ‌న‌తో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు సాయం చేస్తున్న వేళ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని టార్గెట్ చేస్తూ ఫేక్ వార్త‌లు రాస్తున్న వారిపై ఇండ‌స్ట్రీ స‌మ‌ర‌భేరి మోగించింది. ఫేక్ వార్త‌ల్ని ప్ర‌చారం చేస్తున్న స‌ద‌రు వెబ్ సైట్‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇండ‌స్ట్రీని కోరుతున్నానంటూ స్టార్ హీరో మ‌హేష్‌బాబు పోస్ట్ చేయ‌డం స‌మ‌స్య ఎంత తీవ్రంగా మారిందో అర్థ‌మ‌వుతోంది. ర‌వితేజ‌, కొర‌టాల శివ‌, రాశిఖ‌న్నా, హ‌రీష్‌శంక‌ర్‌, ర‌ష్మిక మంద‌న్న‌, అనిల్ సుంక‌ర‌, వంశీ పైడిప‌ల్లి, అనిల్ రావిపూడి, క్రిష్ జాగ‌ర్ల‌మూడి, రానా ద‌గ్గుబాటి, మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, బీవీఎస్ ర‌వి, అల్ల‌రి న‌రేష్‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్, సినీ ల‌వ‌ర్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌