విజయ్ దేవరకొండని చాలామంది అవమానించారట

Film makers insults Vijay devarakonda
Vijay Deverakonda

సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో వేషాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు వేషాలు ఇవ్వకుండా చాలామంది అవమానించారట ! ఎందుకంటే వాళ్లకు నేను తెలిసిన వ్యక్తిని కాను అలాగే నాకు బ్యాగ్రౌండ్ లేకపోవడం కూడా ఒక కారణమని అంటున్నాడు . ఈరోజు నాకు స్టార్ డం అనేది వచ్చింది కానీ నేను నటుడిగా ప్రయత్నించబట్టి చాలాకాలం అవుతోందని కానీ సడెన్ గా నేను వెలుగులోకి వచ్చినట్లు చాలామంది అనుకుంటున్నారని కానీ నన్ను చాలామంది తొలినాళ్ళ లో రిజెక్ట్ చేసారని నిర్మొహమాటంగా చెప్పాడు విజయ్ దేవరకొండ .

పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో మంచి జోరు మీదున్నాడు విజయ్ దేవరకొండ .  తాజాగా డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు ఈ హీరో . విజయ్ దేవరకొండ కెరీర్ తొలినాళ్ళ లో ఇబ్బందులు పడ్డాడు కాబట్టి న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేస్తున్నాడు . ఈ సంస్థ ద్వారా యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నాడు విజయ్ దేవరకొండ .

 

English Title: Film makers insults Vijay devarakonda