బాలీవుడ్ స్క్రీన్‌పై రియ‌ల్‌హీరో జీవితం!


బాలీవుడ్ స్క్రీన్‌పై రియ‌ల్‌హీరో జీవితం!
బాలీవుడ్ స్క్రీన్‌పై రియ‌ల్‌హీరో జీవితం!

స‌ర్జిక‌ల్ స్ట్రైక్ త‌రువాత భార‌త ప్ర‌భుత్వం తీసుకున్న‌ సంచ‌ల‌న నిర్ణ‌యం బాలాకోట్ దాడులు. పాకిస్టాన్‌ని స్థావ‌రంగా చేసుకేని బాల‌కోట్ కేంద్రంగా జైషే మ‌హ‌మ్మ‌ద్ మూక‌లు టెర్ర‌రిజాన్నివిస్త‌రిస్తూ గ‌త కొంత కాలంగా యావ‌త్ ప్ర‌పంచాన్నివ‌రుస దాడుల‌తో వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. స‌ర్టిక‌ల్ స్ట్రైక్స్ దాడికి ప్ర‌తీకారంగా ఉగ్ర‌ర మూక‌లు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న బ‌స్‌పై ఆత్మాహుతి దాడికి దిగ‌డంతో దాదాపు 60 మంచి సైనికులు అమ‌రుల‌య్యారు. దీనిపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న జ్వాల‌లు చెల‌రేగ‌డంతో బీజేపీ ప్ర‌భుత్వం దీన్నోస‌వాల్‌గా స్వీక‌రించింది.

పాకిస్థాన్ స్థావ‌రంగా బాల‌కోట్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్న జైషే మ‌హ‌మ్మ‌ద్ స్థావ‌రాలే ల‌క్ష్యంగా ఏయిర్ఫోర్స్‌ని రంగంలోకి దింపి వ‌రుస దాడులను చేయించింది. ఈ దాడి అనంత‌రం భార‌త్ గ‌గ‌న త‌లంపై అనుమానాస్ప‌దంగా సంచ‌రించిన పాకిస్థాన్ ఆర్మీ యుద్ధ విమానాన్ని మిగ్ 21 ఫైట‌ర్ జెట్‌తో వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ త‌రిమికొట్టి సాంకేతిక లోపం కార‌ణంగా పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో పాక్ సైన్యానికి బందీగా ప‌ట్టుబ‌డ్డారు. అనేక దౌత్య ప్ర‌య‌త్నాలు, అమెరికా ఆంక్ష‌ల కార‌ణంగా చిత్ర‌హింస‌ల అనంత‌రం రెండు రోజుల త‌రువాత వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ ని పాక్ భార‌త సైన్యానికి అప్ప‌గించింది. దీంతో

రెండు రోజుల పాటు చిత్ర హింస‌ల‌కు గురిచేసినా ఎలాంటి భ‌యం బెరుకు లుకుండా నిల‌బ‌డిన అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ హీరో అయ్యాడు. బాల‌కోట్ ఉదంతం నేప‌థ్యంలో త్వ‌ర‌లో ఓ సినిమా రాబోతోంది. దేశం కోసం ప్రాణాల‌ని సైతం లెక్క‌చేయ‌ని రియ‌ల్ హీరో క‌థ‌గా బాలీవుడ్ తెర‌పైకి రాబోతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూష‌ణ్‌కుమార్‌, మ‌హావీర్ జైన్‌, ప్ర‌గ్యా క‌పూర్‌తో క‌లిసి భారీ చిత్రాల నిర్మాత‌, ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ నిర్మించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని భూష‌న్ కుమార్ శుక్ర‌వారం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. అభిషేక్ క‌పూర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.