ఓడిపోయిన సినిమావాళ్లు


Film personalities defeat in telangana elections

తెలంగాణ ఎన్నికల్లో సినిమావాళ్లు కూడా పోటీ చేసారు కానీ ముగ్గురు ఓడిపోయారు కూడా దారుణంగా . తెలుగుదేశం పార్టీ తరుపున శేరిలింగం పల్లి స్థానం నుండి పోటీ చేసాడు నిర్మాత భవ్య ఆనంద్ ప్రసాద్ , అయితే టీఆర్ ఎస్ అభ్యర్థి చేతిలో దారుణంగా ఓడిపోయాడు భవ్య ఆనంద్ ప్రసాద్ . అలాగే నటుడు బాబూమోహన్ భారతీయ జనతా పార్టీ తరుపున ఆందోల్ నుండి పోటీ చేసాడు , అయితే బాబూమోహన్ కూడా ఓడిపోయాడు .

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలిచిన బాబుమోహన్ కు ఈసారి కేసీఆర్ టికెట్ కేటాయించకపోవడంతో భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసి ఓటమిపొందారు . ఇక హీరోయిన్ రేష్మ కూడా భారతీయ జనతా పార్టీ తరుపున ఖమ్మం జిల్లా వైరా స్థానం నుండి పోటీ చేసింది . ఈ భామ కూడా ఓటమి చెందింది . ఈరోజుల్లో చిత్రంతో సంచలనం సృష్టించిన ఈ భామకు రాజకీయాల మీద ఆసక్తి దాంతో పోటీ చేసింది కానీ ప్రజలు తిరస్కరించారు .

English Title: Film personalities defeat in telangana elections