వాయుసేనకు సెల్యూట్ అంటున్న స్టార్ హీరోలు

 Film stars reacted on surjical strikesపాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి చొరబడి మరీ ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టిన భారత వాయుసేన కు జేజేలు పలుకుతోంది యావత్ భారతం . ఇక సినిమా స్టార్స్ అయితే భారత సైనికుల పోరాట స్ఫూర్తికి సెల్యూట్ అంటూ ఉద్వేగానికి లోనౌతున్నారు . సరిగ్గా 12 రోజుల కిందట పుల్వామాలో భారత సైనికులను 40 మందికి పైగా పొట్టన పెట్టుకున్నారు పాక్ తీవ్రవాదులు .

 

ఆత్మాహుతి దాడి చేయడంతో భారత సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోగా , పెద్ద సంఖ్యలో క్షతగాత్రులయ్యారు . దాంతో ప్రతీకార దాడి చేయాలనీ తపించిపోతున్న భారత సైనికులకు మంచి అవకాశం చిక్కింది . పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చొరబడి కేవలం 29 నిమిషాల వ్యవధిలోనే లక్ష్యాలను ఛేదించి ఉగ్ర మూకలను మట్టుబెట్టారు . దాంతో సినిమా స్టార్ జేజేలు పలుకుతున్నారు . ఎన్టీఆర్ , రామ్ చరణ్ , మోహన్ బాబు , రాజమౌళి , అఖిల్ , లతో పాటుగా దేశ వ్యాప్తంగా యువత సంబరాలు చేసుకుంటున్నారు .

English Title : Film stars reacted on surgical strikes