మొత్తానికి బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు!మొత్తానికి బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు!
మొత్తానికి బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు!

నంద‌మూరి బాల‌కృష్ణ ఫైన‌ల్‌గా అనిల్ సుంక‌ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. గ‌తంలో బాల‌య్య న‌టించిన `లెజెండ్` చిత్రానికి అనిల్ సుంక‌ర వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన విషయం తెలిసిందే. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , వ‌రాహి చ‌ల‌న చిత్రం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అయితే ఈ ఆరి అనిల్ సుంక‌ర సోలోగా ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై బాల‌కృష్ణ‌తో ఓ భారీ చిత్రా‌న్ని నిర్మించాల‌ని చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తాజాగా నందమూరి బాలకృష్ణ నిర్మాత అనిల్ సుంకరకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని తెలిసింది. అనిల్ సుంక‌ర ఓ ద‌ర్శ‌కుడితో స్టోరీ లైన్ వినిపించార‌ట‌. త‌ను చెప్పిన లైన్ బాలయ్యకు విప‌రీతంగా న‌చ్చేసింద‌ట‌. స్టోరీ, డైరెక్ట‌ర్ విష‌యంలో బాల‌య్య సానుకూలంగా స్పందించార‌ట‌. దీంతో అనిల్ సుంక‌ర మొత్తానికి బాల‌య్య‌ని ఒప్పించాడ‌ని చెబుతున్నారు.

అయితే బాలయ్యతో అనిల్ సుంక‌ర చేయ‌బోతున్న మూవీ రెగ్యుల‌ర్ మాస్ మ‌సాలా ఫిల్మ్ కాద‌ని, బాల‌య్య మార్కు చిత్రాల‌కు పూర్తి బిన్నంగా వుంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను చిత్రంలో బాల‌కృష్న న‌టిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఈ మూవీ పూర్త‌యిన త‌రువాతే అనిల్ సుంక‌ర మూవీ సెట్స్ పైకి రానుంద‌ట‌.