సంతోష్ శ్రీ‌నివాస్‌కు భారీ ఆఫ‌ర్‌?


సంతోష్ శ్రీ‌నివాస్‌కు భారీ ఆఫ‌ర్‌?
సంతోష్ శ్రీ‌నివాస్‌కు భారీ ఆఫ‌ర్‌?

`కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్‌కు తాజాగా భారీ ఆఫ‌ర్ ల‌భించిన‌ట్టు తెలుస్తోంది. `హైప‌ర్‌` త‌రువాత కొంత విరామం తీసుకున్న సంతోష్ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `అల్లుడు అదుర్స్‌` చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుండ‌గా ఆయ‌న‌కు మరో బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించిన‌ట్టు తెలిసింది. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా ఆయ‌న ఓ భారీ చిత్రం చేయ‌బోతున్న‌ట్టు చెబుతున్నారు.

ఇటీవ‌లే బాల‌య్య కోసం ఓ స్టోరీ సిద్ధం చేసిన సంతోష్ శ్రీ‌నివాస్ దాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంక‌ర‌కు వినిపించార‌ట‌. సంతోష్ చెప్పిన లైన్ అద్భుతంగా వుండ‌టంతో వెంట‌నే బాలకృష్ణ‌కు నెరేట్ చేయించార‌ట‌. ఇంకేముంది క‌థ కొత్త‌గా వుండ‌టం, తన మార్కు చిత్రాల‌కు భిన్నంగా వుండ‌టంతో బాల‌య్య ఈ మూవీలో న‌టించ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ‌

ఈ మూవీ కోసం ఇప్ప‌టికే `బ‌ల‌రామ‌య్య బ‌రిలోకి దిగితే..` అనే టైటిల్‌ని కూడా రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం. బాల‌య్య ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను రూపొందిస్తున్న మూవీ చేస్తున్నారు. ఇట‌వ‌లే ఈ మూవీ షూటింగ్ మొద‌లైంది. దీరి త‌రువాతే నెక్ట్స్ మూవీ గురించి బాల‌య్య ఆలోచించాల‌నుకుంటున్నార‌ట‌. లైన్‌లో బి.గోపాల్‌తో పాటు శ్రీ‌వాస్ కూడా బాల‌య్య కోసం ఎద‌రుచూస్తున్నారు. వీరిద్ద‌రిని ప‌క్క‌న పెట్టి సంతోష్ శ్రీ‌నివాస్ చిత్రాన్ని ముందు మొద‌లుపెడ‌తారో లేదో చూడాలి.