అఫీషియల్ : మహేష్ సినిమాకు ఆమెనే ఫైనల్ చేశారు!


అఫీషియల్ : మహేష్ సినిమాకు ఆమెనే ఫైనల్ చేశారు!
అఫీషియల్ : మహేష్ సినిమాకు ఆమెనే ఫైనల్ చేశారు!

మహేష్ బాబు స్టైల్ మార్చి నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. యంగ్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్, మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున చిత్ర బృందం మహేష్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది.

చెవికి పోగు, మెడ పై రూపాయి టాటూ తో మహేష్ లుక్ పోకిరి మూవీని గుర్తు చేస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో వ్యంగ్యాస్త్రం గా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇందులో మహేష్ కు జోడీ గా కియారా అద్వానీ నటిస్తుందని లేదా సయీ ముఖర్జీ నటించనుందని వార్తలు వినిపించాయి. తాజాగా కీర్తి సురేష్ ని మేకర్స్ సంప్రదించారన్నారు.
గురువారం ఈ వార్తలపై ఇన్ స్టార్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. మహేష్ చిత్రాల్లో నటిస్తున్నానని కీర్తి సురేష్ వెల్లడించింది. ee చిత్ర రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్టు చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది. కరోనా కట్టడిని బట్టే స్టార్స్ షూటింగ్లకు ఒకే చెప్పాలనుకుంటున్నారట.