ఎట్ట‌కేల‌కు టీమ్ `నిశ్శ‌బ్దం` వీడింది


ఎట్ట‌కేల‌కు టీమ్ `నిశ్శ‌బ్దం` వీడింది
ఎట్ట‌కేల‌కు టీమ్ `నిశ్శ‌బ్దం` వీడింది

`నిశ్శ‌బ్దం` టీమ్ ఎట్ట‌కేల‌కు పెద‌వి విప్పింది. గ‌త కొంత కాలంగా త‌మ సినిమా ఓటీటీ బాట ప‌డుతోందంటూ వ‌స్తున్న వార్త‌ల్ని ఖండిస్తూ వ‌చ్చిన టీమ్ మెంబ‌ర్‌స్ ఎట్ట‌కేల‌కు నిశ్వ‌బ్దం వీడారు. ఈ మూవీ కూడా ఓటీటీలో రిలీజ్ అవుతోందంటూ ప్ర‌క‌టించేశారు. అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో టీజీ విశ్వ‌ప్ర‌సాద్ , కోన వెంక‌ట్ సంయుక్తంగా నిర్మించారు.

క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో గ‌త కొన్ని నెల‌లుగా థీయేట‌ర్ల‌న్నీ మూత‌ప‌డ్డాయి. దీంతో రిలీజ్‌కి రెడీగా వున్న సినిమాల‌న్నీ రిలీజ్ విష‌యంలో ద‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న వేళ కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధ‌మయ్యాయి. ఇప్ప‌టికే బాలీవుడ్‌కు చెందిన ప‌లు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కాగా తెలుగులో మాత్రం `వి` సినిమాతో ఈ ప‌రంప‌ర మొద‌లైంది.

దీంతో ఇదే బాట‌లో `నిశ్వ‌బ్దం` రిలీజ్ అవుతుంద‌ని చ‌ర్చ‌న‌డిచింది. ఈ సినిమా గురించి న‌డిచిన చ‌ర్చ మ‌రే సినిమా గురించి జ‌ర‌గ‌లేదు. మొత్తానికి ఈ చిత్రం అక్టోబ‌ర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా టీమ్ వెల్ల‌డించింది. ఇటీవ‌ల విడుద‌లైన `వి` నిరాశ‌ప‌ర‌చ‌డంతో టాలీవుడ్ మొత్తం `నిశ్శ‌బ్దం` ఫ‌లితం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.