`వ‌కీల్ సాబ్‌` రెడీ అయిపోయారండోయ్‌!


`వ‌కీల్ సాబ్‌` రెడీ అయిపోయారండోయ్‌!
`వ‌కీల్ సాబ్‌` రెడీ అయిపోయారండోయ్‌!

గ‌త ఏడు నెల‌లుగా `వ‌కీల్‌సాబ్` షూటింగ్ లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయింది. దీంతో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫామ్ హౌస్‌కి ప‌రిమిత‌మైపోయారు. ఈ టైమ్‌లో ఆయ‌న చ‌తుర్మాస దీక్ష తీసుకున్నారు. ఈ స‌మ‌యంలో బారు గ‌డ్డం పెంచేశారు. తాజాగా అన్‌లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా మూవీ షూటింగ్స్ స్టార్ట్ కావ‌డంతో ఈ మూవీ షూటింగ్‌ని కూడా ప్రారంభించేశారు.

గ‌త కొన్ని నెల‌లుగా బారు గ‌డ్డంతో ద‌ర్శ‌న‌మిచ్చిన ప‌వ‌ర్‌స్టార్ `వ‌కీల్‌సాబ్‌` షూటింగ్ తిరిగి ప్రారంభం కావ‌డంతో ఒక్క‌సారిగా మారి త‌న లుక్‌లోకి ట్రాన్స్ ఫార్మ్ అయిపోయారు. ఒక్క‌సారిగా హ్యాండ్స‌మ్‌గా మారిపోయారు. ప‌వ‌ర్‌కి సంబంధించిన స్టిల్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.  బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ మూవీలో ప‌వ‌న్ రెండు డిఫ‌రెంట్ గెట‌ప్‌ల‌లో క‌న‌పించ‌బోతున్నారు. ప్ర‌జెంట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ప‌వ‌న్ లుక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ నెల 2 నుంచి ప‌వ‌న్ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ షెడ్యూల్‌లో ప‌వ‌ర్‌, శృతిహాస‌న్‌ల‌పై రొమాంటిక్ ట్రాక్ ని షూట్ చేస్తార‌ట‌. సంక్రాంతి కి రిలీజ్ చేయాల‌ని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.