మాస్ మ‌హారాజా అస‌లు రూపం బ‌య‌ట‌పెట్టాడు!


మాస్ మ‌హారాజా అస‌లు రూపం బ‌య‌ట‌పెట్టాడు!
మాస్ మ‌హారాజా అస‌లు రూపం బ‌య‌ట‌పెట్టాడు!

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ.. ఐదు ప‌దుల వ‌య‌సుకు అత్యంత చేరువ‌లో వున్నా ఈ హీరోలో జోష్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. వెండితెర‌పై మెరుపు వేగంతో క‌ద‌లాగే హీరో ఈ వ‌య‌సులో ఎవ‌రైనా వున్నారా అంటే అది ర‌వితేజ ఒక్క‌రు మాత్ర‌మే అని యావ‌త్ ఇండ‌స్ట్రీ మొత్తం యుక్త కంఠంతో స‌మాధానం చెబుతుంది. గ‌త కొంత కాలంగా ఫామ్‌ని కోల్పోతున్న ర‌వితేజ మ‌ళ్లీ ఫామ్‌లోకి రావాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో `క్రాక్‌` సినిమా చేస్తున్నారు. ప‌వ‌ర్‌ఫుల్ క్రాక్ పోలీస్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా ఈ సినిమా షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా ఆపేశారు. క‌రోనా వైర‌స్ విజృంభిస్తుండ‌టంతో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్‌ని విధించిన విష‌యం తెలిసిందే.

దీంతో స్టార్స్ అంతా ఇళ్ల‌కే  ప‌రిమిత‌మైపోయారు. ఎవ‌రికి తొచిన ప‌ని వారు చేస్తూ ఈ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని గ‌డిపేస్తున్నారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా అంద‌రిలాగే త‌న‌కు తోచిన వ్యాప‌కంతో కాల‌క్షేపం చేస్తున్నారు. జిమ్‌లో వ‌ర్క‌వుట్‌లు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా తీసిన ర‌వితేజ గ్రే హేయిర్ బియ‌ర్డ్ లుక్ ప‌లువురిని షాక్‌కు గురిచేస్తోంది. క‌నిపించి క‌న‌పించ‌ని విధంగా జిమ్‌లో ర‌వితేజ వ‌ర్క‌వుట్లు చేస్తుండ‌గా తీసిన ఓ ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. తెల్ల‌ని గ‌డ్డంతో ర‌వితేజ అస‌లు రూపం నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది.

 

View this post on Instagram

 

Stay home stay safe stay fit!

A post shared by RAVI TEJA (@raviteja_2628) on

Credit: Instagram