ఫ్యాన్స్ ఆగ్రహించారు.. యువీ స్పందించింది!

ఫ్యాన్స్ ఆగ్రహించారు.. యువీ స్పందించింది!
ఫ్యాన్స్ ఆగ్రహించారు.. యువీ స్పందించింది!

ప్ర‌భాస్ హీరోగా యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌లు వంశీ, ప్ర‌మోద్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇట‌లీ, స్పెయిన్, జార్జియా వంటి దేశాల్లో క‌రోనా వైర‌స్ అప్పుడ‌ప్పుడే వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో జార్జియాకు వెళ్లి షూటింగ్ చేసి వచ్చింది యువీ టీమ్‌.

ఆ స‌మ‌యంలో భార‌త్‌లో క‌రోనా వైర‌స్ కేసులు లేక‌పోవ‌డం, జార్జియాలో అత్య‌తం వేగంగా ప్ర‌బ‌లుతుండ‌టంలో వెంట‌నే తేరుకున్న చిత్ర బృదం అక్క‌డ షెడ్యూల్‌ని వేగంగా పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ టైటిల్ లోగోని చిత్ర బృందం ఉగాదికి విడుద‌ల చేస్తుంద‌ని ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఇప్ప‌టికీ ఎలాంటి అప్‌డేట్ లేక‌పోవ‌డంతో ఈ సినిమా టీమ్‌పై ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం మొద‌లుపెట్టారు.

దీంతో యువీ టీమ్ ఎట్ట‌కేల‌కు స్పందించింది. ప్ర‌స్తుతం మీరు, మేము ఓ మ‌హ‌మ్మారి మ‌ధ్య చిక్కుకుని వున్నాము. ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా చాలా మంది ప్రాణాలు ప్ర‌మాదంలో వున్నాయి. ప్రస్తుత ప‌రిస్థితుల కార‌ణంగా మా కార్య‌క‌లాపాల‌న్నింటినీ ఆపేశాము. అంతా స‌ద్దుకున్నాక మ‌రిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకొస్తామ‌ని ప్రామిస్ చేస్తున్నాం. ఈ స‌మ‌యంలో ప్ర‌తీ ఒక్క‌రూ ఇంట్లోనే వుండండి.. సుర‌క్షితంగా వుండండి` అని ట్వీట్ చేశారు.

Credit: Twitter