సామ్ మొత్తానికి సాధించేసిందా?


సామ్ మొత్తానికి సాధించేసిందా?
సామ్ మొత్తానికి సాధించేసిందా?

పెళ్లి త‌రువాత నుంచి స‌మంత కొత్త త‌ర‌హా క‌థ‌ల్నే ఎంచుకుంటోంది. విభిన్న‌మైన క‌థ‌ల్ని ఎంచుకుంటూ క‌మ‌ర్ష‌య‌ల్ క‌థానాయిక‌ల‌కి భిన్నంగా వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటోంది. యుట‌ర్న్‌, మ‌జిలి, ఓ బేబీ వంటి మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల్లో న‌టించి సూప‌ర్ హిట్‌ల‌ని ద‌క్కించుకుంది. అయితే తాజాగా ఆ జోరుకు `జాను` చిత్రం క‌ళ్లెం వేసింది.

త‌మిళ హిట్ చిత్రం `96` ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. అయినా ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌లేదు. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద `జాను` ఫ్లాప్‌గా నిలిచింది. ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత కొంత సైలెంట్ అయిన స‌మంత తాజాగా ఓ క్రేజీ ఆఫ‌ర్‌ని ద‌క్కించుకున్న‌ట్టు తెలిసింది.

బెంగ‌ళూరుకు చెందిన గాయ‌ని నాగ‌ర‌త్న‌మ్మ జీవిత క‌థ ఆధారంగా సింగీతం శ్రీ‌నివాస‌రావు ఓ బ‌యోపిక్‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే నాగ‌ర‌త్న‌మ్మ పాత్ర కోసం సింగీతం ముందు అనుష్క‌ని సంప్ర‌దించార‌ట‌. తాజాగా ఆ అవ‌కాశం స‌మంత‌ను వ‌రించింద‌ని తెలిసింది.