విశ్వరూపం 2 విడుదల అవుతుందా ?


financial problems for kamal hassans vishwaroopam 2కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం విశ్వరూపం 2. ఈనెల 10న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఇప్పటి వరకు ఎవరూ కొనుక్కోలేదు. ఇక తాజాగా ఈ సినిమాకు మరో సమస్య వచ్చిపడింది. సాయి మీరా అనే నిర్మాణ సంస్థ కమల్ హాసన్ పై కోర్టుకెక్కింది. 2008 లో మాకు మర్మయోగి అనే సినిమాని చేసి పెడతానని మాట ఇవ్వడంతో దాదాపు 7 కోట్ల బడ్జెట్ కు ఒప్పుకున్నాం అందులో భాగంగా 4 కోట్ల రూపాయల ను అడ్వాన్స్ గా ఇచ్చాం కానీ మా సినిమా చేయకుండా ఇతర సినిమాలు చేస్తూ కాలయాపన చేస్తున్నాడు కానీ మాకు మాత్రం సినిమా చేయడం లేదని అందుకే విశ్వరూపం 2 విడుదల కాకుండా స్టే ఇవ్వాలని సదరు సంస్థ కోర్టు ని ఆశ్రయించింది.

అయితే కోర్టులో మరింత గడువు కావాలని కమల్ హాసన్ తరుపు లాయర్ కోర్టుకు విన్నవించుకోవడంతో తదుపరి విచారణను వాయిదావేసింది కోర్టు. అయితే విశ్వరూపం 2 విడుదల ఎన్నో రోజులు లేదు కాబట్టి ఈలోపు ఒప్పందం జరిగితే ఓకే లేకపోతే కమల్ హాసన్ విశ్వరూపం 2 కి కష్టాలు తప్పవు. ఇంతకుముందు విశ్వరూపం మొదటి భాగానికి కూడా కష్టాలు వచ్చాయి అప్పుడు ఈ దేశాన్నే విడిచి పెట్టి పోతాను అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు కమల్ . ఇక ఇప్పుడేమో విశ్వరూపం 2 కి ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. మరి ఈ ఇబ్బందుల నుండి కమల్ గట్టెక్కుతాడా ? విజయం సాధిస్తాడా ? చూడాలి.

English Title: financial problems for kamal hassans vishwaroopam 2