విజయ్ సినిమా సెట్ లో అగ్నిప్రమాదం


విజయ్ సినిమా సెట్ లో అగ్నిప్రమాదం
విజయ్ సినిమా సెట్ లో అగ్నిప్రమాదం

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న 63 వ చిత్ర షూటింగ్ లొకేషన్ లో మంటలు చెలరేగి సెట్ అగ్ని ప్రమాదానికి గురయ్యింది దాంతో సెట్ అగ్నికి ఆహుతయ్యింది . అయితే అదృష్ట వశాత్తు ఈరోజు సినిమా షూటింగ్ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది లేదంటే పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది . విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే . ఆ సినిమా షూటింగ్ కోసం చెన్నై మహానగరం లోని మీనాంబ్బకం లో భారీ సెట్ వేశారు .

అయితే రకరకాల సెటప్ లు వేస్తున్న క్రమంలో వెల్డింగ్ చేస్తుండగా కొన్ని నిప్పు రవ్వలు గడ్డిపై పడటంతో వెంటనే అంటుకొని మంటలు చెలరేగాయి . అసలే ఎండలు ఆపై ఎండిన గడ్డి దాంతో వెంటనే మంటలు వ్యాపించాయి . ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చారు కానీ అప్పటికే సెట్ లో కొంత భాగం కాలిపోయింది దాంతో నిర్మాతకు లక్షల్లో నష్టం వాటిల్లింది . విజయ్ సరసన నయనతార నటిస్తోంది ఈ చిత్రంలో .