సైరా నరసింహారెడ్డి సెట్లో భారీ అగ్ని ప్రమాదం


సైరా నరసింహారెడ్డి సెట్లో భారీ అగ్ని ప్రమాదం
సైరా నరసింహారెడ్డి సెట్లో భారీ అగ్ని ప్రమాదం

ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి సెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది . ఈరోజు తెల్లవారు ఝామున సైరా సెట్లో అగ్ని ప్రమాదం సంభవించి మొత్తం కాలి బూడిదయ్యింది దాంతో భారీమొత్తం లో ఆస్థి నష్టం జరిగింది . అయితే ఈ ప్రమాదం సంభవించిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం మాత్రం జరగలేదు . సైరా వర్గాలను విస్మయానికి గురిచేసిన ఈ సంఘటన నార్సింగ్ ప్రాంతంలో జరిగింది .

కోకాపేట్ సమీపంలో గల నార్సింగ్ లో చిరంజీవి కి ఫాం హౌజ్ ఉంది . ఆ ఫాం హౌజ్ లో సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం భారీ సెట్స్ వేసారు . షూటింగ్ దాదాపుగా అయిపోవచ్చింది అందులో . అయితే ఈరోజు తెల్లవారు ఝామున పెద్ద ఎత్తున మంటలు రావడంతో చుట్టుపక్కల వాళ్ళు గమనించి పోలీసులకు సమాచారం అందించారు . అయితే అప్పటికే సెట్ దాదాపుగా కాలిపోయింది . షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రాధమిక అంచనాకు వచ్చారు పోలీసులు . అయితే ఆస్థి నష్టం ఎంత అనేది తెలియాల్సి ఉంది . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే .