ఫస్టాఫ్ బాగుందట కానీ సెకండాఫ్ యావరేజ్ అట


first half ok but secondhalf littile bit down syas dil raju నాని నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్రం ఫస్టాఫ్ ఎంటర్ టైన్ మెంట్ తో బాగానే ఉన్నప్పటికి సెకండాఫ్ మాత్రం కొద్దిగా తగ్గిందని అయితే ఓవరాల్ గా మాత్రం కృష్ణార్జున యుద్ధం ప్రేక్షకులు మెచ్చే చిత్రం అవుతుందని అన్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు . నాని ద్విపాత్రాభినయం పోషించిన కృష్ణార్జున యుద్ధం రేపు విడుదల అవుతున్న విషయం తెలిసిందే అయితే ప్రీ రిలీజ్ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చాడు దిల్ రాజు .

చిత్ర నిర్మాతలు కొత్తవాళ్లు కావడంతో కృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని దిల్ రాజు చేతిలో పెట్టారు . దాంతో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు . నాని తో కలిసి మూడు రోజుల క్రితం ఈ చూసిన దిల్ రాజు పై విధంగా వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు . సెకండాఫ్ అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అంటున్నాడు దిల్ రాజు .