`పుష్ప‌క విమానం` నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్‌!

`పుష్ప‌క విమానం` నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్‌!
`పుష్ప‌క విమానం` నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్‌!

మిడిల్ క్లాస్ మెలోడీస్’ తరువాత ఆనంద్ దేవరకొండ న‌టిస్తున్న మ‌రో ఫ్యామిలీ డ్రామా ‘పుష్పక విమానం’. ఈ చిత్రం ద్వారా దామోద‌ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. గీత్ సైని, శాన్వి మేఘ‌న హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు.  కింగ్ ఆఫ్ ద హిల్ బ్యాన‌ర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ ఫాద‌ర్గోవ‌ర్ధ‌న్‌రావు దేవ‌ర‌కొండతో క‌లిసి విజ‌య్ మ‌ట్ట‌ప‌ల్లి, ప్ర‌దీప్ ఎర్ర‌బెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రామ్ మిరియాల సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి `సిల‌కా…` అంటూ సాగే పార్టీ సాంగ్ కి సంబంధించిన లిరిక‌ల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ పాటను హీరో విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు.
‘సిలకా’ పాట ప్రధానంగా కథానాయకుడి పెళ్లి సందర్భంగా ప్రదర్శించిన ఆర్కెస్ట్రా. అయితే ఈ పాట మొత్తం వివాహంపై వ్యంగ్యంగా సెటైర్లు వేస్తూ సాగుతోంది.

`చౌరస్తా` ఫేమ్ రామ్ మిర్యాల సంగీతం సమకూర్చారు. ఆనంద్ గుర్రం మ‌రో ర‌చ‌యిత‌తో క‌లిసి సాహిత్యం అందించారు. ఈ పాటలో కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ తో పాటు సంగీత ద‌ర్శ‌కుడు రామ్ కూడా క‌నిపించారు. చ‌మ‌న్ బ్ర‌ద‌ర్స్ పేరుతో వీరిద్ద‌రూ ఈ పాట‌లో న‌టించారు. కొత్త పంథాలో తెర‌కెక్కిన ఈ పాట సినిమాకి హైలైట్‌గా నిలిచేలా వుంది.