5 కోట్లు నొక్కేసిన విజయ్ దేవరకొండ

Five crores benefit for Vijay devarakondaహీరో విజయ్ దేవరకొండ 5 కోట్లు నొక్కేసాడు . విజయ్ దేవరకొండ 5 కోట్లు నొక్కేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? టాక్సీ వాలా సూపర్ హిట్ కావడంతో నిర్మాతలకు లాభాలు వచ్చి పడ్డాయి దాంతో ఆ లాభాల్లోంచి విజయ్ కి వాటాగా 5 కోట్లు ఇస్తున్నారు ఈ చిత్ర బృందం . టాక్సీ వాలా చిత్రానికి కేవలం 40 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నాడు విజయ్ దేవరకొండ . పెళ్లి చూపులు చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు విజయ్ దేవరకొండ . అయితే ఆ సమయంలో ఈ టాక్సీ వాలా ఒప్పుకున్నాడు , అంటే అప్పుడు పెద్దగా గుర్తింపు లేని హీరో కావడంతో అప్పటి డిమాండ్ మేరకు విజయ్ కి 40 లక్షలు రెమ్యునరేషన్ అనుకున్నారట .

అయితే అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగింది . దాంతో అతడికున్న క్రేజ్ కి వచ్చిన డబ్బుతో న్యాయం చేయాలనీ భావించి అయిదు కోట్లు ఇవ్వడానికి నిర్ణయించారట . లక్ అంటే ఇదే నలభై లక్షలు ఎక్కడ అయిదు కోట్లు ఎక్కడ ? టాక్సీ వాలా మంచి వసూళ్లు సాధిస్తూ ప్రేక్షకాదరణ పొందుతోంది .

English Title: Five crores benefit for Vijay devarakonda