జూన్ 1న ఎన్ని రిలీజ్ అవుతున్నాయో తెలుసా


five movies are ready to fight at boxoffice

సకాలంలో విడుదల కానీ చిత్రాలన్నీ ఒకేసారి వస్తుండటంతో చిన్న సినిమా నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది . ఈనెల 25న అలాగే అంతకుముందే విడుదల కావాల్సిన సినిమాలు వాయిదాపడి జూన్ 1న విడుదల అవుతున్నాయి దాంతో జూన్ 1న రద్దీ ఎక్కువయ్యింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 నుండి 7 సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి అయితే ఇప్పటికైతే అయిదు సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి , మిగతా వాటి గురించి పక్కన పెడితే రెడీ గా ఉన్న అయిదు సినిమాలు ఇలా ఉన్నాయి .

నందమూరి కళ్యాణ్ రామ్ – తమన్నా నటించిన ” నా నువ్వే ” , విశాల్ – సమంత జంటగా నటించిన ” అభిమన్యుడు ”, కింగ్ నాగార్జున రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ” ఆఫీసర్ ” , రాజ్ తరుణ్ – అమైరా దస్తూర్ జంటగా నటించిన ” రాజుగాడు ” చిత్రాలతో పాటుగా కొత్త దర్శకుడు నరసింహారావు తెరకెక్కించిన ” శరభ ” విడుదలకు సిద్ధంగా ఉన్నాయి . అయితే ఒకేసారి అయిదు సినిమాలు పోటీ పడటం వల్ల అన్ని సినిమాలకు థియేటర్ లు దొరకవు దాంతో ఒకటి రెండు సినిమాలు మళ్ళీ పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యం లేదు . మరి ఈ అయిదు సినిమాలలో ఏవి విడుదల అవుతాయో ? ఏవి పోస్ట్ పోన్ అవుతాయో చూడాలి .