ఫలక్ నుమా దాస్ 2 కూడా తీస్తారంట


విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఫలక్ నుమా దాస్ . కాగా మే 31 న విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మంచి వసూళ్ల ని సాధించింది దాంతో ఫలక్ నుమా దాస్ 2 తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమాకు వివాదాల వల్లే ఎక్కువ టాక్ వచ్చింది . విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ విశ్వక్ సేన్ ని టార్గెట్ చేయడంతో వివాదం ముదిరింది .

ఓ కొత్త సినిమా వారం రోజుల్లో 7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేయడం సంచలనంగా మారింది దాంతో ఫలక్ నుమా దాస్ 2 తీస్తామని అంటున్నారు తండ్రీకొడుకులు కరాటే రాజు , విశ్వక్ సేన్ . మొదటి వారంలో 7 కోట్లకు పైగా వసూల్ కావడంతో మా సినిమా సూపర్ హిట్ అంటూ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు ఫలక్ నుమా దాస్ చిత్ర యూనిట్ . ఇక రెండో పార్ట్ భారీ తారాగణంతో చేస్తారట .