వంగ‌పండు ప్ర‌సాద‌రావు క‌న్నుమూత‌!Flok singer Vangapandu Prasadarao is no more
Flok singer Vangapandu Prasadarao is no more

ఏం పిల్ల‌డో ఎల్ద‌మొస్త‌వా.. ఏం పిల్లో ఎల్దామొస్తవా..చిల‌క‌లు క‌త్తులు దుల‌ప‌రిస్త‌య‌ట ఏం పిల్ల‌డో ఎల్ద‌మొస్త‌వా.. అంటే యువ‌త‌ని ఉద్య‌మ బాట ప‌ట్టించిన ప్ర‌జా వాగ్గేయ కారుడు, ఉత్త‌రాంధ్రా జ‌న‌ప‌ద ఉద్యమ కారుడు వంగ‌పండు ప్ర‌సాద‌రావు మృతి చెందారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున పార్వ‌తీపురంలోని స్వ‌గ్రామంలో గుండె పోటుతో మృతి చెందారు.

ఆయ‌న మృతి ప‌ట్ల ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖులు, సినీ వ‌ర్గాలు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. 1943 జూన్‌లో జ‌న్మించిన వంగ‌పండు ప్ర‌సాద‌రావు దాదాపు 300 ల‌కు పైగా పాట‌లు రాశారు. ఆయ‌న రాసిన, పాడిన చాలా పాట‌లు సినిమాల్లో కూడా వినిపించాయి. ఉర్రూత‌లూగించాయి. ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి, టి. కృష్ణ క‌లిసి న‌టించిన `అర్థ్ర రాత్రి స్వ‌తంత్య్రం` చిత్రంలోని ఏం పిల్ల‌డో ఎల్ద‌మొస్త‌వా.. ఏం పిల్లో ఎల్దామొస్తవా..చిల‌క‌లు క‌త్తులు దుల‌ప‌రిస్త‌య‌ట ఏం పిల్ల‌డో ఎల్ద‌మొస్త‌వా…` పాట దేశ వ్యాప్తంగా వున్న అన్ని భాష‌ల్లోకి అనుఇంచ‌బ‌డిందంటే ఆయ‌న క‌లం బ‌లం ఏంతో అర్థం చేసుకోవ‌చ్చు.