ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తారా ఈ హీరోలు ?


Flop director hopes on Kamal haasan and venkatesh

శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం చిత్రంతో అట్టర్ ప్లాప్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు దాంతో అతడితో సినిమా చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు . అయితే మెగా కాంపౌండ్ లో కర్చీఫ్ వేసాడు కానీ అక్కడ కథ సెట్ కాకుండా అడుగు కూడా ముందుకు పడదు దాంతో రెండేళ్ల సమయం వృధా అయ్యింది . ఇంకేముంది వేంకటేష్ తో ఓ సినిమా చేయాలనీ అనుకున్నాడట శ్రీకాంత్ అడ్డాల అక్కడ కూడా ఇదే పరిస్థితి . సురేష్ బాబు కి కథ నచ్చకుండా ప్రాజెక్ట్ ముందుకు కదిలేది లేదు అందుకే అది కూడా కుదరలేదు .

కానీ తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం కేవలం వెంకటేష్ తో మాత్రమే కాకుండా కమల్ హాసన్ తో కూడా సినిమా చేయాలనీ చూస్తున్నాడట శ్రీకాంత్ అడ్డాల . ఇంతకుముందు కమల్ హాసన్ , వెంకటేష్ ల కాంబినేషన్ లో ఈనాడు అనే సినిమా వచ్చింది , అలాగే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో నటించాడు . దాంతో ఈ ఊహాగానాలు వస్తున్నాయి . కానీ ఈ కాంబినేషన్ లో సినిమా అంటే డౌటే !  ఎందుకంటే ……. శ్రీకాంత్ అడ్డాల కథలో బాగా వీక్ కాబట్టి , కథ లేకుండానే సినిమా చేస్తాడు కాబట్టి .

English Title: Flop director hopes on Kamal haasan and venkatesh

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sobhita dhulipala thighs show goes viralReginaPawan kalyan sensational comments on NTRRashmi fires on black mailerVimala raman reveals her bikini and boyfriend