అర్జున్ 150వ చిత్రం కురుక్షేత్రం ప్లాప్


Flop talk to arjun kurukshetram

తమిళ స్టార్ హీరో అర్జున్ తెలుగులో కూడా స్టార్ డం పొందాడు . తెలుగులో పలు చిత్రాల్లో నటించి స్టార్ డం పొందినప్పటికీ ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించాడు . అయితే తాజాగా ఈ హీరో నటించిన కురుక్షేత్రం తెలుగు , తమిళ బాషలలో విడుదల అయ్యింది . మరో విశేషం ఏంటంటే ఈ సినిమా అర్జున్ కు 150వ సినిమా కావడం విశేషం . ఈ సినిమా గత మూడు నెలలుగా విడుదల సమస్యని ఎదుర్కొంటోంది . అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అంటూ ప్రకటించడానికి కారణం ఆర్ధిక లావాదేవీలు . మొత్తానికి అన్ని ఇబ్బందులను అధిగమించి రిలీజ్ చేస్తే సినిమాని పట్టించుకున్నవాళ్లే కరువయ్యారు .

నిన్న తెలుగులో కురుక్షేత్రం విడుదల కాగా లభించినవే తక్కవ థియేటర్లు అయినప్పటికీ జనాలు లేక థియేటర్ లన్నీ వెలవెలబోయాయి . అర్జున్ 150వ చిత్రం అంటూ కాస్త ప్రచారం చేసినప్పటికీ లాభం లేకుండాపోయింది . అయినా ఈ సినిమాకు పెద్దగా ప్రచారం కూడా చేయలేదు . అర్జున్ కూడా ఈ సినిమాని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు , అయితే విలన్ గా నటించిన అభిమన్యుడు మాత్రం తెలుగులో పెద్ద హిట్ అయ్యింది . అభిమన్యుడు చిత్రంలో విశాల్ హీరో అన్న విషయం తెలిసిందే .

English Title: Flop talk to arjun kurukshetram