దేవదాస్ ప్లాప్ …..జాబితాలోFlop talk to devadas

ఈరోజు విడుదలైన దేవదాస్ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది అయితే హీరోలు అక్కినేని నాగార్జున , నాని లు నటించిన చిత్రం కావడంతో ఓపెనింగ్స్ బాగానే వస్తున్నాయి. ఇద్దరు హీరోలకు తోడు హాట్ భామ రష్మీక మందన్న కూడా నటించడంతో మంచి వసూళ్లే వస్తున్నాయి. అయితే దేవదాస్ సినిమాకు ఈ నాలుగు రోజులు బాగానే ఉంటుందని కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా చిత్రం విడుదల అవుతుండటంతో దేవదాస్ కథ కంచికేనని అంటున్నారు. సరైన కథ లేకపోవడంతో పాటుగా స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకునేలా లేదని కాకపోతే నాగార్జున -నాని ల నటన వల్ల మాత్రమే సినిమా ఓ మోస్తరుగా ఉందని విమర్శిస్తున్నారు. ఇక కొంతమంది మాత్రం సినిమా ఫరావలేదని అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం పనిగట్టుకుని మరీ ప్లాప్ అని ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా నానిపై ఆగ్రహంగా ఉన్న కొంతమంది దేవదాస్ ప్లాప్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.

నానిపై కొంతకాలంగా కౌశల్ ఆర్మీ ఆగ్రహంగా ఉంది. ఇక దేవదాస్ సినిమా రిలీజ్ కి ముందే దేవదాస్ ని ప్లాప్ చేస్తాం అంటూ ప్రతిన బూనారు. కౌశల్ పట్ల వివక్ష చూపిస్తున్న నానికి చుక్కలు చూపిస్తామని , దేవదాస్ ని ప్లాప్ చేస్తామని హెచ్చరించారు కూడా . కట్ చేస్తే సినిమా విడుదల అయ్యింది. పెద్దగా ఆకట్టుకునేలా దేవదాస్ లేకపోవడంతో ఇక ప్రచారం వీర లెవల్లో చేస్తున్నారు . అయితే ఇలా ప్లాప్ అంటూ చేసేవాళ్ళు కౌశల్ ఆర్మీ నా ? లేక సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండేవాళ్ళా అన్నది తేలాలి. కౌశల్ ఆర్మీ విషయాన్ని పక్కన పెడితే దేవదాస్ మాత్రం పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అలరించడం లేదు అన్నది మాత్రం వాస్తవం .

English Title: Flop talk to devadas