మరో ప్లాప్ మూటగట్టుకున్న నిహారిక


Flop talk to Niharika's Suryakantham 
మెగా కుటుంబం నుండి హీరోయిన్ గా వచ్చిన నిహారిక మరో ప్లాప్ మూటగట్టుకుంది . నిన్న రిలీజ్ అయిన సూర్యకాంతం కూడా ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది . ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది నిహారిక . ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో కొంత గ్యాప్ తీసుకొని హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేసింది . అయితే ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది దాంతో ఇపుడు సూర్యకాంతం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిహారిక .
నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకులు లేకుండాపోయారు . కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో సూర్యకాంతం కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది . దాంతో హ్యాట్రిక్ ప్లాప్స్ మూటగట్టుకుంది నిహారిక . ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంపిక చేసుకోకపోవడమే నిహారిక బలహీనత . తన పరిధి లోంచి బయటకు వస్తే తప్ప ఈ భామ హిట్ కొట్టేలా లేదు పాపం .

English Title : Flop talk to Niharika’s Suryakantham

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry